Bill Gates Flight Delay: బిల్‌గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!
- బిల్‌గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు
- విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం
- పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates Flight Faces Landing Trouble in Vijayawada Due to Fog: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ ఈరోజు అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అమరావతి పర్యటన కోసం సోమవారం ఉదయం బిల్‌గేట్స్ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే బిల్‌గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ చుట్టూ బిల్‌గేట్స్ స్పెషల్ ఫ్లైట్ చక్కర్లు కొడుతోంది. పైలట్‌కు రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడం వల్ల విమానాన్ని దింపడం సాధ్యపడలేదు.
అధికారుల సమాచారం ప్రకారం.. బిల్‌గేట్స్ విమానం విజయవాడ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతంలో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు విమానం వేచి ఉండాల్సిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ పైలట్‌కు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. విజిబిలిటీ స్థాయి సురక్షిత ల్యాండింగ్‌కు సరిపడేంతగా మెరుగుపడిన తర్వాతే.. బిల్‌గేట్స్ స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అధికారులు అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిస్థితిని సమర్థంగా నిర్వహిస్తున్నారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
బిల్‌గేట్స్ ఈరోజు అమరావతిలో పర్యటించనున్నారు. గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయానికి రానుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు బిల్‌గేట్స్‌తో సమావేశమవుతారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్‌కు సీఎం వివరిస్తారు. అనంతరం బిల్‌గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం అవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!