Tirumala: ఇవాళ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవోపేతంగా జరుగనుంది. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.
Read Also: CM YS Jagan: నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం
Also Read
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 67,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో రూ.2.94 కోట్లు సమర్పించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!