*నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు.. రామాలయాలకు పోటెత్తనున్న భక్తులు.
*భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.. నేడు మిథిలా మైదానంలో స్వామి వారి కల్యాణం.. శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న పురవీధులు.
*పశ్చిమ గోదావరి: నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం.. శ్రీ రామనవమి సందర్భంగా యాత్రకు విరామం.. తణుకు తేతలిలో రాత్రి బస చేసిన సీఎం జగన్. తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర.
*కడప: నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం.. ఈ నెల 25 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు.. 20న హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్న రాములవారు.. 21న గరుడసేవ, 22న కల్యాణ వేడుకలు.. 26న పుష్పయాగంతో ముగియనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.
*నేడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం.. పెడనలో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్.
*కేరళ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్
*నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం.. ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శ్రీసీతారాముల కళ్యాణం
*నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం, సాయంత్రం గ్రామోత్సవం
*తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం
*ఐపీఎల్: నేడు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్
*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,140.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,960.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.90,600.