Gun Fire: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో బావమరిదిపై ఎయిర్ గన్‌తో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బావమరిదికి గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన సిరాజ్‌కు పాత పాల్వంచలోని యువతితో వివాహం జరిగింది. అయితే వారి కాపురంలో వివాదాలు చెలరేగడంతో భార్య పుట్టింటిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తన భార్యను పంపించడం లేదని కోపంతో బావ సిరాజ్ బావమరిది ఇంటికి మరొకరితో కలిసి వచ్చి ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బావమరిది కాలిలో బుల్లెట్ దిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Cancer Medicine : క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ మూడు మందులపై ధరల తగ్గింపు