Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,872 కోట్లతో 8 ఏళ్ల కాలంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఏపీలోని చిత్తూరు, అనకాపల్లి, శ్రీసత్యసాయి, గుంటూరు, కృష్ణ, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం 1256 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా.. ఏపీలో కొత్తగా మరో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
Read Also: Andhra Pradesh: దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్…
* ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు.
1) అనకాపల్లి (అనకాపల్లి జిల్లా)
2) వలసపల్లె గ్రామం (మదనపల్లి మండలం, చిత్తూరు జిల్లా)
3) పాలసముద్రం (గోరంట్ల మండలం, శ్రీ సత్యసాయి జిల్లా)
4) తాళ్లపల్లి గ్రామం (మాచర్ల మండలం, గుంటూరు జిల్లా)
5) నందిగామ ( కృష్ణా జిల్లా)
6) రొంపిచర్ల గ్రామం ( నరసరావు డివిజన్, గుంటూరు జిల్లా)
7) నూజివీడు (కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా)
8) డోన్ ( నంద్యాల జిల్లా)