Jawan Suicide: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్సా శివ అప్పలనాయుడుగా గుర్తించారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న అప్పలనాయుడు గురువారం సాయంత్రం లాడ్జిలో దిగినట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకు గది తలుపు తీయకపోతే లోపలకు చూసి లాడ్జి నిర్వాహకులు పోలీసులకు తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Read Also: Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్‌లో ఏమున్నాయంటే..!