Eluru Crime: ఏలూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విసిరేసారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఏలూరు అశోక్ నగర్ అమలోద్భవి స్కూల్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్‌లో ఉన్న విద్యార్థిని డెలివరీ అయిన తర్వాత మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయట వదిలేసినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏలూరు టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. హాస్టల్‌లో ఇంటర్మీడియట్ రెండో ఏడాది చదివే విద్యార్థిని డెలివరీ అయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీం పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడింది.
Read Also: Bashar al-Assad: విమాన ప్రమాదంలో సిరియా అధ్యక్షుడి మృతి..?