CM Chandrababu: గత ప్రభుత్వ హయాంలో మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని.. ఇంత పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటం ఇదే మొదటి సారి అని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. మద్యం పైన సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఇసుకపై సీనరేజీ తీసేసిన తరువాత పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరగకూడదన్నారు. ఎంత ఇసుక కావాలో అంతా ఉదయం పూటే దొరుకుతుందన్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక వెళ్ళే చోట సీసీ కెమెరాలు పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుదామని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవ్వరూ వేలు పెట్టడానికి వీల్లేదని.. కలెక్టర్లకు ఇసుకపై పూర్తి కంట్రోల్ ఉంటుందన్నారు.
Read Also: Minister Satya Kumar Yadav: ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు.. ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌ను కూడా లిక్కర్ విషయంలో పూర్తిగా అమలు చేస్తున్నామన్నారు. బెల్ట్ షాపులు పెట్టినా, రేట్లు పెంచినా తెలియాలని.. అధికారులు చెప్పకపోయినా.. తాగిన వాళ్ళు కరెక్టుగా చెపుతారేమో అంటూ సీఎం ఛలోక్తులు విసిరారు. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు అమలులో నిర్దాక్షిణ్యంగా పని చేయాలన్నారు.డిజిటల్ పేమెంట్ల వలన ఎన్డీపీఎల్‌ను కంట్రోల్ చేయవచ్చన్నారు. గంజాయి తీసుకున్న వాళ్ళు లేనిపోని క్రైంలు చేస్తున్నారని.. గంజాయి, డ్రగ్స్, సెల్ ఫోన్ల కారణంగా మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. డీ అడిక్షన్, రీహ్యాబిలిటేషన్ సెంటర్లపై కలెక్టర్లు, ఎస్పీలు కంట్రోల్ తీసుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నికల్‌గా, సైంటిఫిక్‌గా అధునాతన మెథడ్స్ వినియోగిస్తూ డీ అడిక్షన్, రీహ్యాబిలిటేషన్ సెంటర్లు నిర్వహించాలన్నారు. ప్రతీ నెలా, ప్రతీ త్రైమాసికంలో దగ్గరగా పరిశీలించాలని అధికారులను కోరారు. ప్రజలకు తెలిసేలా కలెక్టర్లు ఈ అంశాలపైన చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also: Shocking Incident: బైక్ కొనివ్వలేదని తాళాలు మింగిన యువకుడు.. చివరకు..
రిమాండ్‌లో ఉన్నా, కన్విక్షన్‌లో ఉన్నా… గంజాయి నిందితులను వదలకుండా మానిటర్ చేయాలన్నారు. గంజాయికి అలవాటు పడిన వారిని మార్చడానికి మెడికల్ అండ్ హెల్త్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలన్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు. సామాన్యుడికి ఇసుక అందుబాటులో ఉండాలన్నారు. అధికారులు కచ్చితంగా ఇసుక మీద కంట్రోల్ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. ఇసుక ధరలు ఇంకా తగ్గించగలం.. ఆ దిశగా పనులు జరగాలన్నారు. గూగుల్, డ్రోన్ కార్పొరేషన్ కలిసి అన్ని అంశాల మీద పని చేయాలన్నారు. గంజాయి పైన కూడా గూగుల్, డ్రోన్ కార్పొరేషన్ పని చేస్తాయన్నారు. డ్రగ్ కంట్రోల్ చెకింగ్‌లు పూర్తిస్థాయిలో జరగాలన్నారు. టెక్నాలజీలో వచ్చే మార్పులు టెస్టింగ్‌లకు వాడాలన్నారు. డీఅడిక్షన్, రీహ్యాబిలిటేషన్ కమిటీలు పెట్టాలని సూచించారు. ఆర్టీజీఎస్, డ్రోన్ కార్పొరేషన్, ఈగల్, జైళ్ళ శాఖతో కలిపి ఒక కమిటీ రాష్ట్ర స్థాయిలో పెట్టాలన్నారు. జిల్లా స్థాయిలో టీంలలో ఎక్సైజ్ అధికారిని కూడా కమిటీలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈగల్‌పై చర్చ జరిగింది. విద్యార్ధులకు ఇటీవల కౌన్సిలింగ్ చేయడం జరిగిందని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. ఒడిశా ఎస్పీలతో గంజాయి రవాణాప వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. స్కూళ్ళు, కాలేజీలలో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ స్కూలులో పదిమంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కమిటీలో ఉంటారన్నారు. గంజాయి కేసులను చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీలతో కలిసి డ్రగ్స్ నిర్మూలనకు పూర్తిస్థాయిలో పని చేస్తున్నామని వెల్లడించారు.