CM Chandrababu: వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలి.. సీఎం ఆదేశాలు
- కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
- వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలి
- సోషల్ మీడియాపై ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సైబర్ క్రైంలు, ఛీటింగ్‌లు జరగకుండా కంట్రోల్ చేయాలని.. రెండు టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలన్నారు. రియల్ టైంలో యూజ్ కేసులు తయారు చేసి, సీసీ కెమెరాలపై కంట్రోల్ చేయాలన్నారు. సీసీ కెమెరాల డేటా విషయంలో కాస్ట్ అఫెక్టివ్‌గా ప్లాన్ సిద్దం చేయాలన్నారు. సీసీ టీవీ కెమెరాలు అన్నిచోట్లా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ డేటా అంతా ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీసీ టీవీల డేటా అనలైజ్ చేసి డ్రోన్‌లతో పని చేస్తారని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రైవర్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్లు కూడా ఎస్పీలతో కలిసి క్రైమ్ కంట్రోల్‌లో కౌన్సిలింగ్ సెషన్స్‌లో వినియోగించాలన్నారు. జిల్లాలో త్రీ మెంబర్, ఫైవ్ మెంబర్ కమిటీలు వేయాలన్నారు. సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా సమర్ధవంతంగా పని చేయాలన్నారు. మనం అసమర్ధులం అయితే నేరస్థులు బలవంతులు అవుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
సోషల్ మీడియాపై ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ
ఐటీ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ లతో కలిపి సోషల్ మీడియాపై ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కేసులు, సైబర్ క్రైం కేసులపైన ఈ కమిటీ పూర్తిస్థాయి స్టడీ చేయనుంది. కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలి లేదా బయటనుంచి నిపుణుల్ని కూడా తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్నవాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా వచ్చే డేటాను రియల్ టైమ్‌లో వినియోగించుకోవాలన్నారు. పోలీసింగ్ అనేది ప్రభావవంతంగా ఉండాలని వెల్లడించారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను కూడా పెట్టుకుని నేరస్థుల్ని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్ల ద్వారానూ ర్యాండమ్ గా తనిఖీలు నిర్వహించాలని సీఎం సూచించారు. రహదారులపై కొన్ని హాట్ స్పాట్‌లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాటిని కూడా విశ్లేషించి ప్రమాదాలు జరక్కుండానూ చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలన్నారు. కొన్ని కేసుల దర్యాప్తు విషయాలను బయటకు వెల్లడించటం ద్వారా ప్రజల్లోనూ అవగాహన పెంచాలన్నారు. సైబర్ క్రిమినల్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులూ కొత్త పరిజ్ఞానం ఉపయోగించాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా రియల్ టైమ్ నేరాలు, ప్రమాదాల నియంత్రణ జరుగుతోందని.. దాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నామన్నారు. నేరస్థులు రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారన్నారు.సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండపడ్డారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!