కృష్ణా జిల్లా పెడనలో సాగునీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెడనలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పెడన మండలం నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలలో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడి చేశారు.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డిలు స్వాగతం పలికారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో తన కోరిక తీర్చాలని వివాహిత పట్ల వెంకటరమణ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకటరమణ కృష్ణవరంగా గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వివాహిత పట్ల వెంకటరమణ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం
గతంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 2021లో సీఐడీ కార్యాలయంలో చోటుచేసుకున్న దాడి కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను ప్రకాశం పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విషయంలో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ విచారణ ముగిసింది.
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, ఈనెల 21న, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం, ఆరోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువును పెంచుతూ ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎమ్వీ సూర్యకళ వెల్లడించారు.
సాగునీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై కేంద్రపార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ ఉప-వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకసభ్య కమిషన్ ఈనెల 16 నుండి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో పర్యటించనుంది.