Ola Showroom: విశాఖలో వింత ఘటన చోటుచేసుకుంది.. రూ.లక్షా 20 వేలు రూపాయలు పెట్టి కొన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ తరచూ కంప్లైంట్స్ రావడంతో విసిగిపోయాడు ఓ కస్టమర్. ఇంట్లో ఆడవాళ్లు బైక్ తీసినపుడు నడిరోడ్డు మీద ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి నిరసన తెలిపాడు ఓ కస్టమర్. బైక్‌ను కొన్న రెండు నెలలలో ఆరు సార్లు ఆగిపోయిందని ఆ వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు నెలలలో ఆరు సార్లు ఒలా ఎలక్ట్రిక్ బైక్ ఆగిపోయిందని, సరైన సర్వీస్ షోరూమ్ వద్ద నుంచి లభించకపోవడంతో.. షోరూమ్‌కు తాళం వేసానని తెలిపాడు ఆ కస్టమర్. లక్షా ఇరవై వేలు పెట్టి కొన్న బండికి సర్విసింగ్ చేయమంటే తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారని కస్టమర్ ఆరోపణలు చేస్తున్నారు. కష్టపడి బండి కొంటే ఇన్ని ఆగిపోతోందని ఆ కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన సర్వీసింగ్ కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదంపై CP సుధీర్ బాబు రియాక్షన్