తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్కు ఆయన చేరుకోనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు భువనగిరి, గద్వాల్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులకు మద్దతుగా ఆమె ప్రచారం చేయబోతున్నారు.
జనసేనలాగ మాది పావలా బేడా పార్టీ కాదు అని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నాడు.. అసలు రాష్ట్రంలో ఉంటేనే కదా పగలు ఏం జరుగుతుందో చూస్తే రాత్రికి కలలు కానొచ్చు.
రాష్ట్రంలో 400 మండలాలకు పైగా కరువు విలయ తాండవం చేస్తుంటే.. కేవలం100 మండలాలు మాత్రమే కరువు ఉందని చెప్పడం మోసపూరితం అన్నారు. కరువు మీద వాతావరణ శాఖ హెచ్చరించినా.. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం రైతాంగం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కున్న అగౌరవ భావం, చిన్నచూపు కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాకం గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యాగాలు వచ్చాయి.. తెరాస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి..
తెలంగాణలో కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేస్తుంది.. కర్ణాటకలో 100 కోట్ల మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు.. నిన్ననే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని డీకే శివకుమార్ అన్నారు.
బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈవెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్లో ప్రయాణించారు. పూర్తిగా స్వదేవీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ తేజస్ యుద్ధ విమానంలో ఆయన ఓ ట్రిప్ వేశారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇప్పట్లో బయటికి వచ్చే ఛాన్స్ లు కనిపించడం లేదు.. సొరంగంలో వారిని బయటకు తీసుకు వచ్చేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. సాంకేతిక సమస్యలతో లోపలికి వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు.