నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం చేయనున్నారు. ఇవాళ నర్సపూర్ లో సాయత్రం 4.30కి ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గోననున్నారు. అలాగే, నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. భువనగిరి, గద్వాల్, కొడంగల్ లో ఆమె ప్రచారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు భువనగిరి సభలో ప్రియాంక గాంధీ పాల్గోననున్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు గద్వాల్ సభలో ప్రసంగించనున్నారు.. మధ్యాహ్నం 3.30 గంటలకు కొడంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.
Read Also: Rajamouli: ఎంత ధైర్యం… జక్కన్నపైనే జోకులా
ఇక, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదిలాబాద్ లో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం. 3.30 గంటలకు నిజామాబాద్ లలో ప్రచార సభలలో పాల్గొంటారు.. ఇక, నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇల్లందు, డోర్నకల్, కొడంగల్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో ప్రచారం చేయనున్నారు. ఉదయం 10గంటలకు ఇల్లందు బహిరంగ సభ.. ఉదయం 11 గంటలకు డోర్నకల్ బహిరంగ సభ.. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కొడంగల్ బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Read Also: PM Modi Tour: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
అలాగే, నేడు ప్రెస్ మీట్స్.. ఇవాళ గాంధీ భవన్ లో ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ జాతీయ నాయకులు, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ మాట్లాడనున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 1 గంటకు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జైరాం రమేష్ ప్రెస్ మీట్.. మద్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ లో కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ప్రెస్ మీట్ ఉండనుంది.