IPL 2026 Auction: 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీ బిడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ మినీ వేలంలో అనేకమంది అగ్రశ్రేణి దేశీ, విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండటంతో జట్ల వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేలంలో మొత్తం రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. ఈ మొత్తంతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం 359 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా, అందులో 110 మంది విదేశీ ఆటగాళ్లు. ఒక్కో జట్టు గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.
కార్ లవర్స్కి గుడ్న్యూస్.. Tata Safari, Harrierలకు పెట్రోల్ వైర్షన్.. త్వరలోనే షూరు!
జట్లు తమ మిగిలిన పర్స్, ఖాళీ స్లాట్‌లు, జట్టు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.64.30 కోట్లతో అత్యధిక పర్స్ కలిగిన జట్టుగా నిలిచింది. 13 స్లాట్‌లు ఖాళీగా ఉండటంతో పాటు, విదేశీ ఆల్‌రౌండర్, ఓపెనర్లు, పేసర్ల కోసం KKR దూకుడుగా బిడ్ వేసే అవకాశం ఉంది. కామెరాన్ గ్రీన్ కోసం వారు గట్టిగా ప్రయత్నించవచ్చని అంచనా.
ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.40 కోట్ల పర్స్ ఉంది. రవీంద్ర జడేజా నిష్క్రమణ తర్వాత లోయర్ ఆర్డర్ ఫినిషర్ లేదా ఆల్‌రౌండర్ కోసం CSK వెతుకుతోంది. లియామ్ లివింగ్‌స్టోన్ వారి ప్రధాన లక్ష్యంగా ఉన్నాడని సమాచారం. స్పిన్ విభాగంలోనూ కొత్త వాళ్లను తీసుకురావడంపై సీఎస్కే దృష్టి పెట్టింది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.25.50 కోట్ల పర్స్‌తో ఇండియన్ పేసర్, నాణ్యమైన స్పిన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం ప్రయత్నించనుంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బ్యాకప్ పేసర్లు, ఓపెనర్లు, స్పిన్నర్లపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఢిల్లీకి విదేశీ ఓపెనర్, మిచెల్ స్టార్క్‌కు బ్యాకప్ పేసర్ అవసరం.
Suryakumar Yadav: ‘నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు.. అవుట్ ఆఫ్ రన్స్ మాత్రమే.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తమ పరిమిత పర్స్‌ను జాగ్రత్తగా వినియోగిస్తూ కీలక స్థానాలను భర్తీ చేయాలని చూస్తున్నాయి. ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ.2.75 కోట్లే మిగిలి ఉండటంతో తక్కువ ధరలో బ్యాకప్ ఆటగాళ్లపై దృష్టి పెట్టే అవకాశముంది. ఈ వేలంలో రవి బిష్ణోయ్, లియామ్ లివింగ్‌స్టోన్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉండనుంది. అలాగే క్వింటన్ డి కాక్, బెన్ డకెట్ లాంటి విదేశీ ఓపెనర్లు, మతీశ పతిరానా, అన్రిచ్ నార్ట్జే వంటి పేసర్లు కూడా జట్ల టార్గెట్‌లలో ఉన్నారు. మొత్తానికి ఐపీఎల్ 2026 వేలం అబుదాబిలో రసవత్తరంగా సాగనుంది.
The gavel drops tomorrow! 🔨💰
The #TATAIPLAuction 2026 is almost here 🥳
Follow the #TATAIPL Auction tomorrow on https://t.co/4n69KTSZN3 💻 pic.twitter.com/oYvUBaBwMJ
— IndianPremierLeague (@IPL) December 15, 2025