జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఓటు ఒక చోటే ఉండాలని కోరామని చెప్పుకొచ్చారు. కొంత మందికి తెలంగాణ, ఏపీ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి.. ఇలాంటి వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని విఙప్తి చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు.
హుజూరాబాద్ నియోజక వర్గం నుండి ఈటల రాజేందర్ ను గెలిపించండి.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. పేదల తరుపున మాట్లాడినందుకే.. కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకొని పార్టీ నుండి బయటకి పంపారు అంటూ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.
రైతు బంధును అనుమతిని ఎన్నికల కమిషన్ రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ్ రావు స్పందించారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం.. ఇది ఏ పార్టీలకు సంబంధించినది కాదు అని తెలిపారు.
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని ఫోన్ కాల్ రావడంతో షాక్కు గురి అయ్యారు. ముంబైలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు ఏక్తా నగర్లో తలదాచుకున్నారని అతడు ఫోన్లో పోలీసులకు తెలిపారు.
విదేశాల్లో ఉన్న ఖలిస్తానీలు భారత రాయబారితో మరోసారి దురుసుగా ప్రవర్తించారు. ఈసారి ఖలిస్తాన్ మద్దతుదారులు రాయబారి తరంజిత్ సింగ్ సంధూను గురుద్వారా లోపలికి తోసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ తెలిపారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై 22 వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.