బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ కి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో పదవిని అలంకరిద్దామని అనుకున్నమాట వాస్తవం కాదా? మీ పుత్రరత్నంను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయాలని ఆశపడ్డారు నిజం కాదా అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు ఇచ్చింది అని ఆ రాష్ట్ర మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు.
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. వృద్దులకు పెన్షన్లు ఇవ్వటం కాదు.. ఇంట్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి.. పీజీ, పీహెచ్ డీలు చదువుకున్న వారిని బర్రెలు, గొర్రెలు కాసుకోమంటున్నాడు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ కాలెండర్ విడుదల చేస్తాము అని ఆయన తెలిపారు.
వరల్డ్ కప్ లో టీమిండియా అన్ని మ్యాచ్లు గెలిచింది.. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయాం.. ఆ మ్యాచ్లో మనం ఎందుకు ఓడిపోయామాని నేను ఎంక్వైరీ చేశాను అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం వల్లే భారత జట్టు విఫలమైంది అని ఆయన విమర్శించారు.
సిద్బోథమ్ వేసిన బంతికి షాట్ కొట్టబోయి గేల్ బ్యాట్ విరిగిపోయింది.. దీంతో అతని పవర్ ఫుల్ బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ నవ్వడం ప్రారంభించారు. గేల్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.
రోహిత్ శర్మ లాగే తాను కూడా టీమ్ కు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదన్నాడు.