KCR Tour: నేడు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఒక్క రోజు సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది. ఇక, గులాబీ బాస్, సీఎం కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పు సుడిగాలి పర్యటనలు చేస్తున్నాండటంతో ప్రతిపక్ష పార్టీలు సైతం తమ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నాయి. అలాగే, నేడు సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఆయన ఇప్పటి వరకు 90 బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
అయితే, సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. ఇక, నేడు షాద్‌నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దుతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఇవాళ్టి మీటింగ్ తో గులాబీ బాస్ పాల్గొన్న సభల సంఖ్య 94కు చేరుకోబోతుంది. రేపు మరో రెండు సభల్లో ఆయన పాల్గొంటారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభతో పాటు గజ్వేల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!