Hardik Pandya: భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తక్కువ మ్యాచుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000కి పైగా పరుగులు, 100కు పైగా సిక్సర్లు, 100కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా హార్దిక్ నిలవడం విశేషం. ఈ జాబితాలో ఆయనతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, అఫ్గానిస్తాన్‌కు చెందిన మహమ్మద్ నబీ, మలేషియాకు చెందిన వీరందీప్ సింగ్ ఉన్నారు.
Read Also: Geeta Arts : లెజెండరీ సింగర్ బయోపిక్ కు అల్లు అరవింద్ శ్రీకారం
అయితే, భారత జట్టు తరఫున టీ20ల్లో 100 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ ఘనతను అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా సాధించారు. హార్దిక్ ఇప్పటి వరకు 123 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 26.78 సగటుతో 100 వికెట్లు తీయగా, అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/16గా ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 23 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన హార్దిక్, 122 మ్యాచ్‌లలో 1,939 పరుగులు, 141.53 స్ట్రైక్‌రేట్, 101 సిక్సర్లు కొట్టాడు.
Read Also: TDP vs YSRCP: గన్నవరంలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. వల్లభనేని వంశీని కలిసినందుకు దాడి..!?
ఇక, ఈ ఘనత సాధించిన హార్దిక్‌కు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువెత్తగా, ఆయన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ (61) ఒంటరిగా పోరాడినా, జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించడంతో.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
