హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నియమించారు.
మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం ఛాన్స్ ఇచ్చారు.. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము జీరోలుగా ఉన్నాం.. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ లీడర్లను, మంత్రులను చేశారు.
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
గడచిన 75 సంవత్సరాల పాలన కంటే సీఎం జగన్ పాలన భిన్నమైనది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలనేదే జగన్ తాపత్రయం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్యమాలు చేశారని మంత్రి చెప్పారు.
నిన్న మొన్నటి దాక సెంట్రల్ జైల్ లో ఉండి ఆరోగ్యం బాగా లేదనే సాకుతో బయటకు వచ్చి మమ్మల్ని ఓడిస్తాడా.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన.. చంద్రబాబు టికెట్లు వేస్తే ఫ్లైట్ ఎక్కేది పవన్ కళ్యాణ్.. నారా లోకేశ్ పాదయాత్ర చేసినా దూకుడు యాత్ర చేసిన ఎప్పటికీ నాయకుడు కాలేడు అంటూ అంబటి రాంబాబు విమర్శించారు.
నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొత్తం పదకొండు మంది యాత్రికులు గల్లంతయినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతికి పదకొండు మంది పర్యాటకులు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో మొట్ట మొదటి సారిగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసే క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వినూత్న చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశ్యంతో పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్ తెలుసుకునేందుకు పోల్ క్యూ రూట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చును.. జీహెచ్ఎంసీ వెబ్ సైట్.. మై జీహెచ్ఎంసీ యాప్ లలో poll Q route యాప్ ను ఆక్టివేట్ చేశారు.
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గగన్పహాడ్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. థర్మాకోల్ తయారీ కంపెనీలో ఈ మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నా.. కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పని చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఏపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు రేపు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు.