తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కర్ణాటక పీసీసీ, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. దేశం అంత తెలంగాణ వైపు చూస్తోంది.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు.. ప్రచారం చేస్తున్న సందర్భంగా నాకు ప్రజలు మార్పు కోరుతున్నట్టు తెలిసింది.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి విధేయత చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఆయన ప్రేర్కొన్నారు. కర్ణాటకలో మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నాం.. తెలంగాణలో కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేస్తుంది.. కర్ణాటకలో 100 కోట్ల మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు.. నిన్ననే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని డీకే శివకుమార్ అన్నారు.
Read Also: V Srinivasa Rao: అన్నయ్య కాంగ్రెస్‌కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్ ఆర్ఎస్ఎస్‌కు అమ్ముతావా..?
సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది పార్టీ అని డీకే శివకుమార్ అన్నారు. మేము ఏం చెప్పినా కమిట్మెంట్ తో చేస్తామన్నారు. మేము అందరికి 24 గంటలు కరెంట్ ఇస్తాం అని చెప్పలేదు.. రైతులకు 5, 6, 7 గంటలు ఇస్తున్నామని చెప్పాం.. మా రైతులకు సరిపడా పవర్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఓ అబద్ధాల కోరు.. కర్ణాటక కి రండి.. గంట ప్రయాణం వచ్చి చూడండి అని అన్నారు. విమానం అంటే విమానం.. బస్ అంటే బస్ ఏర్పాటు చేస్తామని శివ కుమార్ తెలిపారు.
Read Also: Samsung Galaxy A05: సామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. సెల్ఫీ ప్రియులకు బెటర్.. ధర ఎంతంటే?
మొదటి కేబినెట్ లోనే.. ఆరు గ్యారెంటీ లకు ఆమోద ముద్ర వేశామని డీకే శివ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణకి ఆరు గ్యారెంటీ లు మోడల్ గా నిలుస్తాయి.. కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పని చేశారు.. ఎవరికి ఎలా చేశారు అనేది తర్వాత చెప్తాము.. సర్వేలు చేసుకుని కర్ణాటకకి రాకుండా కేసీఆర్ ఆగిపోయారు అని ఆయన ఆరోపించారు. కర్ణాటక రైతులకు మేం ఉచిత కరెంట్ ఇవ్వడం ప్రారంభించాం.. తెలంగాణతో పోల్చితే కర్ణాటక పెద్ద రాష్ట్రం.. కరెంట్ విషయంలో తెలంగాణ కంటే మేం మెరుగ్గా ఉన్నామన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయని డీకే శివ కుమార్ వెల్లడించారు.
Read Also: MLC Kavitha: అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా.. షుగర్ ఫ్యాక్టరీని మూసింది బిజేపీ
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారంటూ డీకే అన్నారు. టీఆర్ఎస్ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అని మోడీ అన్నారు.. మరీ ఏమైంది.. సెన్సెస్ కి పార్టీ విధానంకి కట్టుబడి ఉంటా.. పారదర్శకంగా పరిపాలన జరగాలి అనేది నా అభిప్రాయం.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే వాణ్ణి నేను అని ఆయన చెప్పారు.. కాంగ్రెస్ అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తోంది.. సీఎం ఎంపిక అనేది కూడా పార్టీ నిర్ణయిస్తుంది.. సీఎం ఎంపిక పెద్ద సమస్య కాదు అని డీకే శివ కుమార్ అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రులను మారుస్తుంది అంటున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ నమ్ముతున్నందుకు ధన్యవాదాలు అని ఆయన చెప్పారు.