ప్రజెంట్ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మోడీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. మరోవైపు వైపు మేస్ట్రో ఇళయరాజా బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ రజనీ బయోపిక్ కూడా చేసే ఆలోచనలో ఉంది కోలీవుడ్.
Also Read : Ranveer Singh : దీపికా 8 గంటల వర్క్ షిఫ్ట్ పై రణవీర్ సింగ్ హాట్ కామెంట్స్
ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో మరొక బయోపిక్ తెరకెక్కబోతుంది. ఎన్నో మధురమైన పాటలకు సంగీతం అందించి, తన మధురమైన గాత్రంతో అద్భుతమైన పాటలు పాడిన లెజెండరీ సింగర్, నటిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు అందుకున్నసంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి. ఆమె పూర్తి పేరు మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి. ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. టాలీవుడ్ బడా నిర్మాణా సంస్థ అల్లు అరవింద్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ ను తెరకెక్కించే ప్లాన్ చేస్తుంది. జెర్సీ, కింగ్డమ్ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ కూడా చేశారట. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రకు నటి సాయి పల్లవి పేరు పరిశీలిస్తున్నాట. లుక్ టెస్ట్ కు సంబంధించి డిస్కషన్ నడుస్తుందట. అన్ని సెట్ అయితే త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ప్రకటన రావచ్చు.