మగువలకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గడం మాటెరుగు.. ధరలకు కళ్లెం పడడం లేదు. రోజురోజుకు ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక్కరోజు స్వల్పంగా తగ్గితే.. ఇంకోరోజు అమాంతంగా పెరిగిపోతుంది. గత వారం భారీగా పెరిగిన ధరలు.. ఈ వారం కూడా అదే స్పీడ్ కొనసాగిస్తోంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.820 పెరగగా.. కిలో వెండిపై రూ.2,900 పెరిగింది. దీంతో రికార్డ్ స్థాయిలో సిల్వర్ ధర దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి: Sydney Terror Attack: నిందితులు పాక్‌కు చెందిన తండ్రీకొడుకులుగా గుర్తింపు.. ఐసిస్ జెండా స్వాధీనం!
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.820 పెరగగా.. రూ.1,34,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 750 పెరగగా రూ.1,23,500 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.620 పెరగగా రూ.1,01,050 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు .. ఏకమైన మెయిటీ-కుకి బీజేపీ ఎమ్మెల్యేలు
ఇక సిల్వర్ ధర కూడా హడలెత్తిస్తోంది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.2,900 పెరిగింది. దీంతో హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో రూ.2,13,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,00, 900 దగ్గర ట్రేడ్ అవుతోంది.