ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇప్పట్లో బయటికి వచ్చే ఛాన్స్ లు కనిపించడం లేదు.. సొరంగంలో వారిని బయటకు తీసుకు వచ్చేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. సాంకేతిక సమస్యలతో లోపలికి వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు.. దీంతో కేవలం లోపల చిక్కుకున్న వారికి పైపులైన్ ద్వారా అధికారులు ఆహారం, ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నారు. నిన్న సొంరంగం నుంచి 41 మందిని బయటకు తీసుకు వస్తున్నామని హడావిడి చేసిన ప్రభుత్వం చివరకి సైలెంట్ అయ్యారు.
Read Also: Revanth Reddy: కేసీఆర్ ఓటుకి 10వేలు పంపాడు.. తక్కువ ఇస్తే అంగీ లాగు గుంజుకొండి
తాజాగా, సీనియర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. సొరంగంలో చిక్కుకున్న నిర్మాణ కార్మికుల దగ్గరకు వెళ్లేందుకు కేవలం 10 నుంచి 12 మీటర్ల డ్రిల్లింగ్ మాత్రమే మిగిలి ఉందన్నారు. కానీ, గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్ తదుపరి ఐదు మీటర్లలో ఎలాంటి ముఖ్యమైన లోహ అడ్డంకులను గుర్తించలేదని వారు పేర్కొన్నారు. కూలిపోయిన సొరంగం కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి సొరంగం పైభాగంలో నేడు బోర్ చేయడానికి మరొక డ్రిల్లింగ్ యంత్రాన్ని సైట్‌కు తీసుకోచ్చారు.
Read Also: Dharmana Prasada Rao: అందుకే అవినీతి నిర్మూలనపై ఫోకస్ చేశాం..!
ఇక, సొరంగంలోకి డ్రిల్లింగ్ మెషిన్ వెళ్లినప్పుడు ఉక్కు పైపు ఆరు-మీటర్ల విభాగాలు కలిసి వెల్డింగ్ చేయనున్నారు. అలాగే, ఇరుకైన సొరంగ మార్గంలోకి వీటిని పంపించనున్నారు. స్టీల్ చ్యూట్ ఏర్పాటు తర్వాత కొత్తగా తవ్విన సొరంగం ద్వారా కార్మికులను సేఫ్ గా తీసుకు వచ్చేందుకు చక్రాల స్ట్రెచర్‌లను వాడాలని చూస్తున్నారు. డ్రిల్లింగ్ మెషిన్ చెక్కిన మార్గం ద్వారా డ్రిల్ బిట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది తెలిపింది. రెండు రోజుల్లో ఎదురైన రెండు ఎదురు దెబ్బలు చాలా రోజులుగా సొరంగం వెలుపల వేచి చూస్తున్న కార్మికుల బంధువుల్లో మరింత ఆందోళన పెంచుతుంది.