పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను సాధారణ పౌరులకు చూపించారని ఆమె ఆరోపణలు చేశారు.
పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఇవాళ (ఆదివారం) బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అంటూ అరిచినట్లు ఉంది కమలం పార్టీ తీరు చూస్తుంటే అని విమర్శలు కురిపించింది.
సంస్కృత భాష అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు అని సీఎం నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికి వాటిని పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకపోవడంపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు అనేక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్ఎస్యూఐ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్ బాల్ టోర్నమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే నేటి (ఆదివారం) ఉదయం 9. 30గంటలకే సీఎం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటికి చేరుకున్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దంమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు.
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఐపీఎల్ 2024 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. రెండు జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. చెన్నైలోని ఎం చిదంబరం క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈసారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.