ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు.
ఇప్పుడు రాజకీయాల్లో లేను.. అలాగే, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ బాగా జరుగుతుంది అని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత ముస్లిం మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.
పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని బొట్లపాలెంలో పోలింగ్ పునః ప్రారంభమైంది. అయితే, పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య వివాదంతో తోపులాట స్టార్ట్ అయింది. దీంతో ఈవీఎం మిషన్లు కింద పడిపోయాయి. ఇక, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే క్యాండిడెట్ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలోని కేఎస్ఎన్ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు పంపిణీ నిలిపివేయడంతో ఆందోళన చేస్తున్నారు.