మాల్దీవుల మంత్రి మూసా జమీర్ ఇవాళ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో సమావేశం కానున్నారు. ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం లాంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.
ప్రభుత్వ ఉద్యోగులు సైతం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఆయన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
అసోంలో స్వైన్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ హెచ్1ఎన్1 వైరస్ సోకి 4 నెలల చిన్నారి మృతి చెందింది. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా రెండో మరణం సంభవించింది.
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత వాడెట్టివార్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీలు ఇటీవల చేసిన కామెంట్స్ పై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికలలో మాదిగలంతా కలిసి సంపూర్ణ మద్దతును అందించి పార్లమెంట్ సభ్యురాలిగా గెలిపిస్తామని ఎమ్మార్పీఎస్ ఉత్తర కోస్తాంద్ర అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల మధ్య భారత్‌లో చైనా తన రాయబారిని నియమించుకోనుంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. 18 నెలల తర్వాత చైనా ఈ నియామకాన్ని చేపట్టింది.