కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి బీజేపీ అమేథీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఏ ఛానెల్ లో ఐనా, హోస్ట్ ఎవరైనా, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు.
పొలాల్లో పంటలను కాల్చే రైతులకు ఈ ఏడాది నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కేంద్రం ఈ లేఖ రాసిన రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ఉన్నాయి.
ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ ఫలితంతో హార్థిక్ పాండ్యా టీమ్ టాప్-4 ఆశలు ఆవిరైపోయాయి.
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ కేసులో భారత్‌కు రష్యా అండగా నిలిచింది. అమెరికా వాదనలను మాస్కో తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా 'భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని' ఆరోపించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ యూనివర్శిటీలోని గార్గి కాలేజీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పీఓకేను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
హర్యానా రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ మిత్రపక్షం జేజేపీ సిద్ధంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా బుధవారం నాడు ప్రకటించారు.