BJP vs Congress: పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఇవాళ (ఆదివారం) బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అంటూ అరిచినట్లు ఉంది కమలం పార్టీ తీరు చూస్తుంటే అని విమర్శలు కురిపించింది. గత పదేళ్ల నుంచి దేశంలో అధికారంలో ఉన్న మీరు..100 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేశారని హస్తం పార్టీ ఆరోపణలు చేసింది. దేశ ప్రజల నుంచి టాక్స్ లు, జీఎస్టీల ద్వారా వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయల.. డబ్బులన్నీ ఏం చేశారని? ఇండియా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండని అని కాంగ్రెస్ పార్టీ సైతం ట్విట్టర్ వేదికగా నిలదీసింది. మీ కార్పొరేట్ మిత్రులకు సుమారు 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారుగా.. మీ కార్పొరేట్ మిత్రులకేమో టాక్స్ లు తగ్గించేశారు.. సామాన్య ప్రజలకు టాక్స్ లు, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, వంట నూనె వంటిపై అధిక రెట్లు వేశారంటూ విమర్శించింది. పేద ప్రజలు ఇచ్చే సబ్సిడీ కూడా ఎత్తేశారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Nalgonda: నల్గొండ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం
అలాగే, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను చాలా బలహీనంగా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ విధించి, వ్యవసాయంపై పెట్టుబడిని రెండింతలు చేశారు.. రైతులను అప్పులు డబుల్ చేశారు.. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కు అమ్ముకుంటున్నారు.. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారంటూ? హస్తం పార్టీ క్వశ్చన్ చేసింది. 5 నెలల కాంగ్రెస్ పాలనలో 5 గ్యారంటీలను అమలు చేసింది.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం చేశాం.. 5 నెలల పాలనపై అంత విషం కక్కుతున్న ఈ బీజేపీ.. 120 నెలలు ఈ దేశాన్ని పాలించి 2014, 2019 లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.