Hyderabad BJP MP candidate Madhavi Latha: హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఇవాళ పోలింగ్ కేంద్రం దగ్గర నానా హంగామా చేసింది. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో సైతం గొడవకు దిగింది. ముస్లీం మహిళలు వేసుకున్న బుర్క ఓపెన్ చేసి పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఇక, మధవిలత తీరుపై పలువురు ఓటర్లు విమర్శలు గుప్పించారు. పోలింగ్ కేంద్రంలో అభ్యర్థికి ఏం పని ఉందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా మాధవిలత ఎన్నికల బరిలో నిలిచింది.
Read Also: AP Elections 2024: ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు..
కాగా, బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత ముస్లిం మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన మాధవిలత ఓటరు కార్డులను పరిశీలించి.. ఓల్డ్ సిటీలో పోలింగ్‌పై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. భారీగా దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని మాధవిలత ఆరోపించింది. చనిపోయిన వారి పేర్లపై కూడా ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అజంపుర, గోషామహల్ లో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీరియస్ అయ్యారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.