AP Elections 2024: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోని.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పోలింగ్ బూతులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి సర్వేలు చెప్పడం మానేశాను చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజల నాడీ తెలుసుకునే వాడిని.. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో లేను.. అలాగే, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ బాగా జరుగుతుంది అని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.
Read Also: AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్.. ఒంటి గంట వరకు ఎంతంటే..?
కాగా, మధ్యాహ్నం సమయం ఖాళీగా ఉంటుందని ఓటెయ్యడానికి వచ్చాను అని లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు. కానీ, ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసిన జనాలు బారులు తీరారు.. ప్రజలందరూ ఉత్తేజంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారు.. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది ఓటు.. అలాంటి ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది.. మొత్తం ప్రజలందరూ ఓట్లు వేయడానికి బస్సుల్లో, ఫ్లైట్లో, ట్రైన్లో వస్తున్నారని పేర్కొన్నారు. ఇక, జూన్ 4వ తేదీన ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుంది అని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.