ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. దీంతో ఏర్పాటైన సిట్ గత రెండు రోజులుగా విచారణ చేసి.. పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్ట్ ను రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న వేళా.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ నెలకొంది. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్పరిణామాలకు భయపడేలా చేసి అమాయకుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోసారి భారతీయ జనతా పార్టీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ ప్రకటించారు. భారత కూటమికి ఓటు వేయాలని ఉత్తరప్రదేశ్ ఓటర్లను విజ్ఞప్తి చేయడానికి నేను ఈ రోజు లక్నోకు వచ్చాను అని కేజ్రీవాల్ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సురేష్ వి షెనాయ్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నది.. దేశంలో అవకాశాలకు కొదవలేదని అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ( గురువారం ) మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అక్కడ.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిర్డికి చేరుకోనున్నారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని దర్శి్స్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు ( గురువారం ) ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక రెడీ చేసినట్లు సమాచారం.
మణిపూర్ రాష్ట్రంలో హింసకు మయన్మార్ లో ప్లానింగ్ జరిగినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. గతేడాది మణిపూర్ లో రెండు జాతుల మధ్య గొడవలో పాల్గొనేందుకు యువకులకు తుపాకులతో శిక్షణ ఇచ్చారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది.
జమ్ముకాశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికల కార్యకలాపాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (గురువారం) పరిశీలించనున్నారు. బారాముల్లా, అనంత్‌నాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
నేడు ( గురువారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్, జౌన్పూర్, భదోహి, ప్రతాప్‌గఢ్‌లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.