Voters Protest: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలోని కేఎస్ఎన్ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు పంపిణీ నిలిపివేయడంతో ఆందోళన చేస్తున్నారు. నిన్న ( ఆదివారం ) రాత్రి ఒంటి గంట నుంచి తెల్లర్లూ నిలబెట్టి ఓటుకు నగదు ఇస్తామని చెప్పడంతో స్థానికులు అక్కడే ఉండిపోయారు. ఎంత సేపటికీ వైసీపీ నేతలు అక్కడికి రాకపోవడంతో స్థానిక ఓటర్లు ఆందోళన బాట పట్టారు. లేటుగా వచ్చిన కొండ్రప్రోలు మెట్ట వైసీపీ నేతపై అక్కడి జనాలు తిరగబడ్డారు.
Read Also: Sonia Gandhi : పేద మహిళలకు ప్రతేడాది లక్ష రూపాయలు.. సోనియా గాంధీ ప్రకటన
అయితే, ఓటుకు 2500 రూపాయలు లేవు.. కేవలం 500 రూపాయల మాత్రమే ఇస్తానని వైసీపీ నేత అనడంతో స్థానిక ఓటర్లు మరింతగా రెచ్చిపోయారు. దీంతో వైసీపీ నేతను అడ్డగించి పెద్ద ఎత్తున మహిళలు కేకలు వేశారు. మీరు ఓటుకు 2,500 రూపాయలు తీసుకుని పంచుతామని.. ఇక్కడ మమల్ని నిలబెట్టి మాకు ఇప్పుడు 500 రూపాయలు మాత్రమే ఇస్థాం అని అనడం దారుణమని అతడ్ని నిలదీశారు. ఓటు వేయడానికి వెళ్లకుండా డబ్బులు తమకు ఓటుకు రూ.2500 పంచాల్సిందే అంటూ అక్కడి స్థానిక ఓటర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు.