New Traffic Rules In AP: ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ వేయనున్నారు.
CM Chandrababu: ఇవాళ చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందివ్వనున్నారు సీఎం.
AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఈరోజు (మార్చ్ 1) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఇక, తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి.
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. అందరినీ మోసం చేసినట్లే రైతులను కూడా దగా చేసిన బడ్జెట్ ఇది.. బాబు షూరిటీ.. నో గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకి మార్గ నిర్దేశనం చేసేలా బడ్జెట్ ఉంది..
RK Roja: ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది. జనాన్ని నమ్మించి నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం.. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే, భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృథా చేశారంటూ ఎద్దేవా చేసింది. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు..
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చ్ 1వ తేదీన) చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
CM Revanth Reddy: గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని తెలిపారు.