Minister Nara Lokesh: కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవ ఉత్సవాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోగా.. మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం, లోకేష్ మాట్లాడుతూ.. రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడంపై పలువురు పలు రకాలుగా చెప్పారు.. మా అమ్మకి ఫోన్ చేసి అభిప్రాయం అడిగా.. నీ మనసులో ఏముందో అదే మనస్పూర్తిగా ఆచరించు అని చెప్పిందని పేర్కొన్నారు. నా తల్లి కోరిక మేరకు శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నాను అని మంత్రి లోకేష్ చెప్పారు.
Read Also: Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. కడప రిమ్స్ కి తరలింపు !
ఇక, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పాండాలని ఆ రాఘవేంద్ర స్వామి వారిని కోరుకున్నాను అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి.. వలసలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇచ్చారు. త్వరలో వలసలు నియంత్రణ కోసం తగిన కార్యచరణ రూపొందిస్తామన్నారు.