Bolivia Bus Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని అక్కడి పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ఇక, బొలీవియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 7 గంటలకు (బొలీవియా స్థానిక కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఉయుని, కొల్చాని రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు ఢీకొనగా.. ఇందులో ఓ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు మృతి చెందగా గాయపడిన వారిని తక్షణమే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Jyothika: ఇక్కడ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది..
అయితే, లాటిన్ అమెరికాలో అతి పెద్ద ఉత్సావాల్లో ఒకటైన ప్రఖాత ఒరురో కార్నివాల్‌కు బస్సులు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. కాగా, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ బృందం వెళ్లి.. సహాయక చర్యలు చేపట్టి గాయపడిని వారిని బయటకు తీశారు. మరణించిన వారిని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రకి తరలించారు.. చనిపోయిన వారిని గుర్తించి బాధిత కుటుంబాలకు అప్పగిస్తామని బొలీవియా అధికారులు పేర్కొన్నారు.