మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు.. అందుకే చర్చ లేని సమయంలో.. బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారు అని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే.. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.. కమీషన్ల కోసం శిలా ఫలకాల కోసమే కొత్త ప్రాజెక్టులు తెచ్చారు.. దేవాదులను నిర్లక్ష్యం చేశారు ఆరోపించారు.
Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ రేపు (మార్చ్ 19న) అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం కానుంది. గురువారం నాడు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన అక్రమ్ ను వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Madhusudhana Chary: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. గతంలో మీరు (కాంగ్రెస్) ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదు అని విమర్శించారు.
SC Classification: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం సంపూర్ణ మద్దతు పలికాయి.
MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
Payal Shankar: ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని బీజేపీ డిప్యూటి ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. ఎన్నో ఏండ్ల కల ఎస్సీ వర్గీకరణ నేడు సహాకరమైంది.. సుప్రీం కోర్టు వరకే పరిమితం అవుతుందనుకున్న వర్గీకరణ నేడు ఫలించిందన్నారు.
CM Revanth Reddy: బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల లెక్క తేలాలని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.. బీసీలు తెలిపే అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీకి అందివ్వాలన్నారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో అబ్దుల్ జమిర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులే కారణమని తోటి స్నేహితులతోనే జమీర్ చెప్పుకున్నాడు. అయితే, గత శనివారం రోజు తాను అద్దెకు ఉన్న ఫ్లాట్ లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
Ponnam Prabhakar: బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు శుభ సూచిక.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు.