SC Classification: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం సంపూర్ణ మద్దతు పలికాయి. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ.. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇక, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మనం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు అప్పట్లో సుప్రీం నోటీసులు ఇచ్చింది.. దాంతో మనం సీనియర్ అడ్వకేట్ నీ పెట్టాం. వర్గీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పాం.. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వెంటనే మేము స్పందించాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం వేసి ప్రక్రియ మొదలు పెట్టాం.. సబ్ కమిటీ సూచన మేరకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. పారదర్శకంగా ఎవరికి అన్యాయం జరగకూడదు.. అనుమానం ఉండొద్దని కమిషన్ సూచన చేసిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Read Also: Betting App Promotions: సినీ నటులైనా వాళ్ళను వదలం!
ఇక, ఎస్సీలో 59 ఉప కులాలు ఉన్నాయి.. ఆ కులాలను మూడు గ్రూపులుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటి గ్రూప్ లో 15 ఉప కులాలున్నాయి.. వారికి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చాం.. రెండో గ్రూప్ లో 18 ఉపకులాలు ఉంటే వారికి 9 శాతం రిజర్వేషన్ ఇచ్చాం.. మూడో గ్రూప్ లో 26 ఉపకులాలు ఉంటే.. వారికి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే, వివేక్ వెంకటస్వామి సూచన మేరకు జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతాం.. 2026 జనాభా లెక్కలు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం.. గ్రూపుల వారీగా పంచుతామని వెల్లడించారు. రిజర్వేషన్లు పెంచాలంటే సహేతుకమైన విధానం ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.