MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది..
- బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది..
- 42 శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో సమాధానం చెప్పాలి..
- కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది: ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ.. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరా గాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు అని ఆరోపించింది. ఇక విపి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు.. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదు అని పేర్కొన్నారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని వాదించారు.. రూ. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సర్వే చేయించింది.. కానీ, ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చింది.
Read Also: Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్‌ఫ్రెండ్ దాడి..
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ఇక, ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదు? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బీసీ వర్గీకరణ కోసం మోడీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు?.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. అసలు ఈ 42 శాతం అన్న లెక్కకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఏ కారణం చేత 42 శాతమని నిర్ణయానికి వచ్చారో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల పాటు కాలయాపన చేసిందన్నారు. ఇక, డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు? అని అడిగారు. కులాల వారీగా, గ్రామాల వారిగా బీసీ జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు? అని కల్వకుంట్ల కవిత క్వశ్చన్ చేశారు.
Read Also: March 18th: క్రికెట్ చరిత్రలో మార్చి 18 ‘స్పెషల్ డే’.. పాకిస్తాన్‌కు మాత్రం..!
కాగా, బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుంది అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు?.. ఏ గ్రూపుకు ఎంత రిజర్వేషన్లు కేటాయిస్తారన్న వివరాలు లేవు.. న్యాయపరమైన చిక్కుల్లో ఈ చట్టాలు ఇరుక్కోవద్దన్నది తమ అభిమతం.. చిన్న చిన్న విషయాల మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే చట్టాలను కొట్టివేసే ప్రమాదం ఉంది.. బీసీ సబ్ ప్లాన్ ను ప్రభుత్వ రూపొందించాలి.. బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి.. గత ఏడాది కేవలం 9200 కోట్లను మాత్రమే కేటాయించిన ప్రభుత్వం అని మండిపడింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేది.. మనంతల మనమే 50 శాతం జనాభాను అవకాశాలకు ఇన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టడం బాధాకరం అని కవిత చెప్పుకొచ్చింది.
Read Also: PM Modi: సునీతా విలియమ్స్‌కి ప్రధాని మోడీ లేఖ.. ఏమన్నారంటే..
అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అవకాశాలు దక్కితేనే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చింది. ఎంతోమంది పోరాట వీరులు, త్యాగదనులు ఉన్నటువంటి బీసీ వర్గాలకు అందాల్సిన అవకాశాలు ఇంకా అందలేదు.. ఉద్యోగ అవకాశాల్లో జాతీయస్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా 23శాతం ఎప్పుడు భర్తీ కాలేదు.. యూపీఎస్సీలో 27 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎప్పుడూ 8 శాతం అవకాశాలు కూడా దక్కలేదు.. బీసీ వర్గాలు ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నారు.. దేశంలో 50% జనాభా ఉన్న బీసీల వద్ద కేవలం 15% మాత్రమే సంపద ఉంది.. ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ఉంది.. భిన్న వృత్తుల సమూహారమైన బీసీ వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి.. కుల వృత్తుల వారు సంప్రదాయ ఆదాయ వనరులను కోల్పోయారు.. అయినప్పటికీ కూడా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి కృషి చేయకపోవడం బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బీసీలకు, మహిళలకు రాజ్యాంగ రక్షణ లేకపోవడం వల్ల విస్మరణకు గురవుతున్నారని కల్వకుంట్ల కవిత వెల్లడించింది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?