MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన అక్రమ్ ను వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీకే అరుణ ఇంట్లో చోరీకి వచ్చి గంటన్నర పాటు ఉండి పోయాడు.. ఢిల్లీలోని 30 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ అక్రమ్.. ఢిల్లీ పోలీసులు పదే పదే పట్టుకొని పోతుండడంతో హైదరాబాద్ కి మకాం మార్చాడు. ఇక, హైదరాబాద్ లో ధనవంతులు ఉండే ఏరియాని టార్గెట్ చేసిన అతడు.. ఎంపీ డీకే అరుణ, పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. చివరికి డీకే అరుణ ఇంటి పరిసర ప్రాంతాల్లో చోరీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
Read Also: Amaravati Capital Works: అమరావతి రాజధాని పనులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అయితే, డీకే అరుణ ఇంట్లోకి ఈజీగా లోపలికి వెళ్లి బయటికి వచ్చే వీలుందని గుర్తించిన అక్రమ్.. ఏదైనా అలజడి జరిగితే పారిపోయేందుకు వెనకాలే రోడ్డు ఉందని గుర్తించాడు. డబ్బులను మాత్రమే అక్రమ్ దొంగలిస్తూ ఉంటాడు అని పోలీసులు తెలిపారు. బంగారంతో పాటు విలువైన వస్తువులను అక్రమ ముట్టుకోడు అని పేర్కొన్నారు. వస్తువులను దొంగలిస్తే వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలంటే ఇబ్బంది అని అతడు చెప్పుకొచ్చాడు.. దొంగతనం చేసి డబ్బులు దొంగలించి జల్సాలకు కోసం అక్రమ్ ఖర్చు పెడుతుంటాడని పోలీసులు వెల్లడించారు.