CM Revanth Reddy: బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల లెక్క తేలాలని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.. బీసీలు తెలిపే అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీకి అందివ్వాలన్నారు. ఎవరు అడగక ముందే రాహుల్ గాంధీ కులగణన డిమాండ్ చేశారు.. ఆయన చెప్పినట్లుగానే కులగణన చేశామన్నారు. దాంతో పాటు అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లు పెంచుతామని మాట ఇచ్చారు.. ఇప్పుడు చేశామని పేర్కొన్నారు. ఇక, 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కూడా చేయలేదు కేంద్రం.. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్ పెంచలేమని సుప్రీం కోర్టు చెప్పింది.. అందుకే బీసీలు ఎంత మంది ఉన్నారో తేల్చే పని మనం చేశామని వెల్లడించారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. బీసీల సహకారంతో ప్రభుత్వం వచ్చింది.. మీ సహకారం.. మేము ఏడాదిలోనే అమలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Nagpur Violence: నాగ్‌పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
ఇక, ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సబ్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ వేశాం.. ఎట్లా న్యాయం చేస్తారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ సీనియర్ నేత.. అధికారులకు చెప్పి చేయించే వ్యక్తి.. అధికారులు ఎట్లా ఉంటారో తెలుసు కదా.. ఎటు అంటే అటు బెండ్ చేస్తారు.. అందుకే చట్టం తెలిసిన వ్యక్తి కాబట్టి.. అందుకే ఉత్తమ్ అన్నని కమిటీ ఛైర్మన్ చేశామన్నారు. డెడికేషన్ కమిటి వేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఇది పెద్ద సమస్య కాదు.. దీన్ని కొట్టేయిద్దమన్నారు అధికారులు.. కానీ, డెడికేషన్ కమిషన్ వేయండి అని కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని నియమించాం.. రెండో విడత అవకాశం ఇచ్చినా.. కొందరు దుర్బుద్ధితో నమోదు చేసుకోలేదు.. మేము చేసే పాలసీ, ఎక్కడ టెస్ట్ పెట్టినా నిలబడాలి అనేదే మా ఆలోచన..
రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తాయి.. సహజమే.. వాటిని తప్పు పట్టలేమన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి సర్వే చేయాలన్న తెలంగాణకి వచ్చి అధ్యాయనం చేసేలా ఉండాలనేది మా ఆలోచన అని రేవంత్ రెడ్డి తెలిపారు.