Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్ కు రప్పించేందుకు లైన్ క్లియర్ అయింది.
Telangana Budget: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి సుమారు 3. 20 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Cabinet Meeting: నేడు (మార్చ్ 19న) తెలంగాణ కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపొతే రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు.
Ponnam Prabhakar: యాదగిరి గుట్ట టెంపుల్ పై శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి చేశామని చెప్తున్నారు.. మా జిల్లా దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. కానీ, ఎక్కడా అభివృద్ధి జరగలేదు అని తెలిపారు.
Gutha Sukender Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలా యాదగిరిగుట్ట నిర్మాణం చేశారు కేసీఆర్ అని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, గుడుల పట్ల ఆయనకు ఉన్న అభిలాషతోనే ఈ ఆలయ నిర్మాణం సాధ్యమయింది..
HYDRAA: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన స్పష్టమైన ప్రకటన కూడా చేశామని తెలిపారు.
MLA Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ వేల కోట్లు అప్పు చేసినా.. ఏం చేశారో కానీ.. యాదగిరి గుట్టను మాత్రం కట్టారు.. అది మంచి ఆలోచన అని పేర్కొన్నారు.
దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పంటలు ఎండిపోతున్నాయని దేవాదుల మోటార్ ను ప్రారంభిస్తున్నాం.. దీంతో 50 - 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.. ప్రాజెక్ట్ ఏజెన్సీని పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.