Botsa Satyanarayana: సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు.
CM Chandrababu: ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ మాట త్వరలో నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పా.. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంది.
ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
MLA Kunamneni: బడ్జెట్ కి సంబందించి అనేక ఆశలు ఉన్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ, ఆ ఆశలు తీరే విందంగా లేదు.. కేవలం కేంద్రం సపోర్టు లేకుండా.. అప్పులపై బడ్జెట్ నెరవేరడం కష్టం.. అలా తీరాలంటే మంత్రదండం కావాల్సి ఉంటుంది.
Alleti Maheshwar Reddy: ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకొనే బడ్జెట్.. కేవలం 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు.
MLC Kavitha: తెలంగాణ బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చెప్పిన మాటలే చెప్పడం తప్ప.. అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో మహిళకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహలక్ష్మీ పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర మహిళలకు రూ.5,005 కోట్లు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు.
Bhatti Vikramarka: తెలంగాణ బడ్జెట్ లో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.