Hyderabad: హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో అబ్దుల్ జమిర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులే కారణమని తోటి స్నేహితులతోనే జమీర్ చెప్పుకున్నాడు. అయితే, గత శనివారం రోజు తాను అద్దెకు ఉన్న ఫ్లాట్ లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కాగా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకి పాల్పడిన రోజు ఇంట్లోనే భార్య రెహన్, అత్త సైతం ఉన్నారు. సూసైడ్ చేసుకున్నాడని తెలిసిన ఎవరికి తెలియకుండా అనంతపురంకు భార్య, అత్త వెళ్లిపోయారు. సోమవారం నాడు అపార్ట్మెంట్ లో బ్యాడ్ స్మెల్ రావడంతో చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందజేశారు.
Read Also: Priyanka Gandhi: కుంభమేళాపై విపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వాలి
అయితే, సోమవారం నాడు అపార్ట్మెంట్ కి వచ్చిన పోలీసులు అబ్దుల్ జమిర్ రూమ్ తలపులు పగలగొట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి స్వగ్రామం అనంతపురం పట్టణంలోని కొవ్వూరు నగర్. రెండు సంవత్సరాల క్రితం గుత్తి పట్టణంలోని రెహన్ ను జమిర్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక సంవత్సరం పాప సైతం ఉంది.