KCR: వరంగల్ లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవర బహిరంగ సభలో గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని అడిగారు. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు అని అడిగారు..
Read Also: KCR: నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం.. నాకు దుఃఖం కలిగిస్తోంది..
ఇక, కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు.. దాని గురించి వైద్యారోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకుని.. అది మంచి పథకమని నేను కొనసాగించాను అని కేసీఆర్ తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం పేరు కూడా మార్చకుండా.. మేము కొనసాగించాం అన్నారు. కానీ, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ కిట్స్ ను ఎందుకు బంద్ చేశారు అని అడిగారు. ఎవరైనా వాటిని ఆపుతారా.. పేదల కోసం తీసుకొచ్చి ఈ పథకాన్ని ఆపడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ప్రభుత్వం నడపడం చేతకాక.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.