తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం మోపడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి…
సాగునీటిపై హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన వరదను సముద్రంలోకి వదులుతుంది.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తుంది.. నంది మేడారం పంప్ హౌస్ నుంచి మానేరుకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్న చేయట్లేదు..…
TSRTC Milestone: తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మంగళవారం నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 199.71 కోట్ల జీరో టికెట్లను టీజీఎస్ ఆర్టీసీ జారీ చేయగా.. నేడు 200 కోట్ల మార్క్ తాకింది. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు చేయనున్నారు. ఎంజీబీఎస్…
Hyderabad Metro Phase II: ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్ ) మండిపడ్డారు. విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది.. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు.. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు రోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు అని ఆరోపించారు.
TG Cabinet Expansion: గత కొంత కాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు (జూన్ 8న) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రి బండిసంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ళ కోసం కేంద్రం నిధులు ఇచ్చింది.. అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు ఇచ్చింది.. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు.. కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది.. అరు గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. వరిధాన్యంకి బోనస్…
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్దతతో పని చేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని గుర్తు చేశారు.
తెలంగాణ సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్. గడిచిన పదేళ్ళుగా... ఐటి, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్‌గా కొనసాగుతూ వచ్చారాయన. కానీ... ఇటీవల జరిగిన బదిలీల్లో స్పీడ్ సీఈఓగా ఆయన్ని నియమించింది ప్రభుత్వం. కానీ... ఇప్పటి వరకు ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రత్యేక ఆఫీసు అంటూ ఏది లేదు. దాని కోసం వెదుకులాట కొనసాగుతోందట.