ఎల్కతుర్తి సభలో కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై.. వెనుకబడుతున్న తీరుపై ఎమోషనల్ అయ్యారు. నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం నాకు దు:ఖం కలిగిస్తోందన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీశారు.. పరిపాలన చేయడంరాక.. రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు.. నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం.. నాకు దుఃఖం కలిగిస్తోంది.. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలు ఎలా ఉండేవి..
Also Read:Ameer Khan : ఎందుకూ పనికి రానని బాధపడుతున్నా : స్టార్ హీరో కుమార్తె
భూముల ధరలు ఎక్కడికి పోయాయి.. ఎందుకు కొనుక్కోవడం లేదు.. ఒక్క ఏడాదిలో ఇంతలా మారిపోయిందా.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. 24 గంటల కరెంట్ ఇవ్వలేదా.. పవర్ కట్స్, మోటర్లు కాలిపోతున్నాయి.. లంచాలు పెరుగుతున్నాయి.. ఐదేళ్లలో ప్రతి ఇంటికి నల్లా రాకపోతే.. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి.. చేసి చూపించాం.. మంచినీళ్లు, కరెంట్ పోతున్నాయి.. వడ్లు కొనే దిక్కు లేదు.. 2014 కంటే ముందు పరిస్థితులు వస్తున్నాయి.. ఇది కాంగ్రెస్ అసమర్థత కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు.
Also Read:BRS Silver Jubilee Public Meeting: కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల కోసం కేసీఆర్ నివాళి..
లోక్ సభ ఎన్నికల్లో.. తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు.. మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు.. మాట్లాడితే కేసీఆర్ పై నిందలు వేస్తున్నారు.. ఆశపడి.. కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు మోసపోయారు.. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
Also Read:BRS Silver Jubilee Public Meeting: కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల కోసం కేసీఆర్ నివాళి..
ఏడాదిన్నరగా కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది.. ఏమి చేసింది.. గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్ ను మించినవాళ్లు లేరు.. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి.. డ్యాన్స్ లు చేసి హామీలు ఇచ్చారు.. పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా.. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది.. అవన్నీ చేసిందా.. 420 హామీలు ఇచ్చారు.. కళ్యాణ లక్ష్మీకి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క అని కేసీఆర్ తెలిపారు.