బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వారు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్, అక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… దేవుళ్ల మీద ఒట్టేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల కోట్ల అవసరం ఉంటుందని, అయితే రూ.12 వేల కోట్లతో కేవలం 25 శాతం మంది రైతులకే రుణమాఫీ చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.
Netanyahu Calls PM Modi: ప్రధాని మోడీకి ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహూ ఫోన్..
మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా నువ్వే ఇచ్చినట్టుగా చెప్పుకుంటావా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లను కేటీఆర్ పంపిణీ చేశారు.
2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం అప్పగించడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రెండేళ్లు గడిచినా అమలు కావడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ వరుసగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంది.
Tragedy: “చనిపోవాలని లేదు”.. నా భార్య, ఆమె బాయ్‌ఫ్రెండ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా..