Tragedy: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వ్యక్తి భార్య చేసిన మోసానికి బలైపోయాడు. తన బిడ్డను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తన భార్యకు తన ప్రియుడితో ఉన్న సంబంధం గురించి ఆరోపిస్తూ తన బాధను 7 నిమిషాల వీడియలో రికార్డ్ చేశాడు. బైక్ నడుపుతున్నప్పుడు చిత్రీకరించిన ఈ వీడియోలో తాను చనిపోవాలని అనుకోవడం లేదని, కానీ తనకు వేరే మార్గం లేదని పదే పదే చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐదేళ్ల క్రితం వారణాసిలోని లఖన్‌పూర్ కు చెందిన ఒక మహిళను ప్రేమ వివాహం చేసుకున్న రాహుల్ మిశ్రా మంగళవారం ఉదయం లోహతా ప్రాంతంలోని తన ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. రాహుల్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భార్య, ఆమె ప్రియుడిపై, అతడి అత్తగారిపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు.
Read Also: Tata Sierra: నెల రోజులు కాకముందే.. 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..

రాహుల్ తన వీడియోలో తాను అనుభవిస్తున్న బాధను వ్యక్తపరిచారు. ‘‘నేను నా భార్యను, నా కొడుకును ప్రేమిస్తున్నాను. కానీ నా భార్య నన్ను మోసం చేస్తోంది. నేను అభ్యంతరం తెలిపినప్పటికీ శుభం అనే వ్యక్తితో నా భార్య సంబంధం కొనసాగిస్తోంది. నా కొడుకు నుంచి విడిపోవడాన్ని నేను భరించలేకపోతున్నాను. ఇకపై నేను దానిని భరించలేను. నేను ఈ రోజు చనిపోబోతున్నాను.నాకు చనిపోవాలని లేదు, కానీ నాకు వేరే మార్గం లేదు’’ అని రాహుల్ తన వీడియోలో చెప్పాడు. నా కొడుకును కలిసేందుకు వెళ్లినా, అందుకు అనుమతించలేదని చెప్పారు. తన అత్తగారు, ఆమె కుమార్తెను తన నెంబర్ బ్లాక్ చేయాలని ప్రేరేపించారని ఆరోపించారు.
పురుషులు వేధింపులకు గురవుతున్నారని, నా భార్య నాపై అనేక చోట్ల ఫిర్యాదు చేసిందని, దీని కారణంగా నేను వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. మహిళలు ఏం చెప్పినా కూడా నిజమే అని ప్రవర్తిస్తున్నారని, 2014 నుంచి పురుషుల వాదనలు వినిపించడం లేదని, ఐపీసీ సెక్షన్ 498A ని సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కేసులో రాహుల్ భార్య, అత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. లవర్ శుభం పరారీలో ఉన్నాడు.
कमज़ोर दिल वाले इस विडियो को न सुनें 🙏🥺
सात मिनट का ये वीडियो हैरान करने वाला है वाराणसी में बीवी की बेवफाई से परेशान युवक ने खुदकुशी कर ली मरने से पहले युवक ने जो कुछ कहा, उसे हर किसी सुनना चाहिए है। pic.twitter.com/p2OEQz1U2Z
— Vaishali Mishra (@1VaishaliMishra) December 10, 2025