Netanyahu Calls PM Modi: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ప్రధాని నరేంద్రమోడీకి ఈ రోజు(బుధవారం) ఫోన్ చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. నెతన్యాహూ పశ్చిమాసియా పరిస్థితులపై మోడీకి వివరించారు. ‘‘గాజా శాంతి ప్రణాళికను త్వరగా అమలు చేయడంతో సహా ఈ ప్రాంతంలో న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారతదేశం మద్దతును ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు’’ అని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Tragedy: “చనిపోవాలని లేదు”.. నా భార్య, ఆమె బాయ్‌ఫ్రెండ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా..
భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పెరుగుతున్న వేగంపై ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పరం రెండు దేశాల సంబంధాలను మరింత పెంచుకోవాలని ఇద్దరు నాయకులు ఆకాంక్షించారు. ఇరువురు కూడా ఉగ్రవాదాన్ని ఖండించారని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా సహించేది లేదని పునరుద్ఘాటించారని ప్రకటన పేర్కొంది.