Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85…
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో వల్ల ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారు.
KTR: తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. "పక్కా మాఫియా పాలన" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
CM Revanth Reddy : దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చిన కేసీఆర్, తన పాత పద్ధతిని మార్చుకోకుండా మళ్ళీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. ఓటమితోనైనా కేసీఆర్ మారుతారని ఆశించానని, కానీ ఆయన తీరు మారలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని…
KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం “సడి లేదు సప్పుడు లేదు” అన్న చందంగా తయారయ్యాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రజల కోసం తీసుకురాలేదని, పైగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన…
KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు జిల్లా పట్ల పాలకులు ప్రదర్శించిన వివక్షను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎండగట్టారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు ఉన్నా నీరు లేక పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు గొప్పలు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యమని కేసీఆర్ విమర్శించారు.…
'SIR' In Telangana: కేంద్ర ఎన్నికల సంఘం నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ను ప్రారంభించింది. ఇప్పటికే, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈసీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, యూపీ ఇలా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను చేపట్టింది. ముఖ్యంగా, ఈ ప్రక్రియపై బీజేపేతర ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.